: సీఎం చంద్రబాబును కలిసిన ఆయేషా మీరా తల్లి!


ఏపీ సీఎం చంద్రబాబును ఆయేషా మీరా తల్లి షంషాద్ బేగం ఈ రోజు కలిశారు. న్యాయం జరిగేలా ప్రభుత్వం తమకు అండగా ఉండాలని చంద్రబాబును కోరారు. ఇందుకు చంద్రబాబు స్పందిస్తూ, సమగ్ర విచారణ జరిపి అన్ని విధాలా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం షంషాద్ బేగం మాట్లాడుతూ, తన కూతురి హత్య కేసును రీ ఓపెన్ చేసి మళ్లీ విచారణ చేపట్టాలని, తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని అన్నారు. కాగా, చంద్రబాబు వద్దకు ఆయేషా మీరా తల్లి షంషాద్ బేగంను వెంట ఉండి తీసుకువెళ్లిన టీడీపీ మహిళా నేత నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ, ఆయేషా మీరా హత్య కేసును మహిళా కమిషన్ టేకప్ చేస్తుందని, అసలు దోషులు ఎవరో తేలాలని అన్నారు.

  • Loading...

More Telugu News