: హిల్లరీ కామెంట్ చేయగానే ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు!
అమెరికా ఏదైనా దేశంపై లేదా విదేశాల్లోని ఏదైనా ప్రాంతంపై దాడి చేయాలంటూ సైనికులకు ఆదేశాలు ఇవ్వాలంటే అధ్యక్షుడు ముందు అమెరికన్ కాంగ్రెస్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో వివిధ దేశాలపై అదేతీరును అనుసరించారు. ఆఖరుకు ఒసామా బిన్ లాడెన్ పై ప్రత్యక్ష ఆపరేషన్ కు కూడా అదే విధానాన్ని అనుసరించారు. ఇప్పుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం కాంగ్రెస్ ను సంప్రదించకుండానే నేరుగా చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.
ఇక్కడ విశేషం ఏమిటంటే, ఈ ఘటన జరగడానికి ముందు ఏబీసీ న్యూస్ కు హిల్లరీ క్లింటన్ ఇంటర్వ్యూ ఇస్తూ...సిరియాలోని అల్ బషర్ వైమానికి స్థావరాలపై దాడులు చేయాలని వ్యాఖ్యలు చేశారు. అంతే.. క్షణాల్లో ట్రంప్ దాడులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో తోమహాక్ క్షిపణులతో దాడులు చేశారు. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది.