: హిందూ యువతిని ప్రేమించాడని.. చెట్టుకు కట్టేసి, హింసించి చంపేశారు!
జార్ఖండ్ లోని గుమ్లా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అక్కడి రజా కాలనీకి చెందిన మహ్మద్ షాలిక్(20) అనే యువకుడిని కొందరు స్థానికులు చెట్టుకి కట్టేసి కొట్టి చంపేశారు. హిందూ యువతిని ప్రేమించడమే ఆ యువకుడు చేసిన తప్పు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. పూర్తి వివరాలు చూస్తే.. శ్రీరామనవమి రోజున ఆ యువకుడు తన ప్రియురాలిని కలవాలనుకున్నాడు. సోసో గ్రామంలో ఉండే ఆమె వద్దకు వెళ్లే క్రమంలో మహ్మద్ షాలిక్‌ను స్థానికులు పట్టుకుని చెట్టుకు కట్టేసి, గంటల తరబడి హింసించారు. తన కొడుకుని హింసిస్తున్నారని తెలుసుకున్న అతడి తండ్రి మహ్మద్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అక్కడకు చేరుకొని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే షాలిక్ మృతి చెందాడు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.