: స్మిత్ కెప్టెన్ అయినా... బాస్ మాత్రం ధోనీయే!: రహానే
పూణే సూపర్ జెయింట్ టీమ్ కు స్టీవ్ స్మిత్ కెప్టెన్ అయినప్పటికీ తనవరకు బాస్ మాత్రం మహేంద్ర సింగ్ ధోనీయేనని ఆ జట్టు టాప్ ఆర్డర్ బ్యాట్స్ మన్ అజింక్యా రహానే తెలిపాడు. తొలి మ్యాచ్ లో విజయం సాధించడం పట్ల రహానే మాట్లాడుతూ, ధోనీ వరల్డ్ క్లాస్ ఆటగాడు మరియు కెప్టెన్ అన్నాడు. మైదానంలో ఫీల్డ్ సెట్ చేయడం, కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ధోనీ ముందుంటాడని చెప్పాడు. తాను స్మిత్ కెప్టెన్సీలో ఒకే ఒక్క మ్యాచ్ ఆడానని, ధోనీ కెప్టెన్సీలో సుదీర్ఘ మ్యాచ్ లు ఆడానని అన్నాడు. స్మిత్ కెప్టెన్సీపై ఒక అంచనాకు రావాలంటే ఇంకా సమయం పడుతుందని చెప్పాడు. ముంబై ఇండియన్స్ కు పార్థివ్, బట్లర్ కిక్ స్టార్ట్ ఇచ్చారని చెప్పాడు. అయితే ఇమ్రాన్ తాహిర్ వరుసగా వికెట్లు తీయడం తమకు కలిసివచ్చిందని అన్నాడు. బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని రహానే తెలిపాడు.