: సెలబ్రిటీలు వస్తే సెల్ఫీలు దిగకూడదు: 'ఆధార్' ఉద్యోగులకు ఆదేశాలు
గతంలో ఆధార్ కార్డుకు సంబంధించిన పనిపై క్రికెటర్ ఎంఎస్ ధోనీ వచ్చినప్పుడు విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) కార్యాలయంలోని ఉద్యోగులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడడంతో పనులకు అంతరాయం ఏర్పడింది. అంతేకాదు, ఆ కారణంగా కొంతమంది ఉద్యోగుల మధ్య మనస్ఫర్థలు సైతం వచ్చాయట. ఈ విషయంపై సీరియస్ అయిన యూఐడీఏఐ అధికారులు.. తమ కార్యాలయానికి సెలబ్రిటీలు వస్తే వారితో ఫొటోలు, సెల్ఫీలు దిగకూడదని ఆదేశించారు. విధులు నిర్వర్తించే సమయంలో ఇటువంటి వాటిని పక్కన పెట్టాల్సిందేనని తేల్చి చెప్పారు.