: ఢిల్లీ విమానాశ్రయంలో తప్పిన ప్రమాదం
ఢిల్లీ విమానాశ్రయంలో ఈ రోజు మధ్యాహ్నం రెండు విమానాలు ప్రమాదం నుంచి తప్పించుకున్నాయి. రన్‌వేపై ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాలు ఒకదానికొకటి ఎదురెదురుగా వచ్చాయని విమానాశ్రయ అధికారులు తెలిపారు. అయితే కొద్దిపాటి దూరంలోనే ఆగిపోయాయని, ఎటువంటి ప్రమాదమూ చోటుచేసుకోలేదని చెప్పారు. కమ్యూనికేషన్ లోపం వల్లే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం నుంచి రెండు విమానాలు తప్పించుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.