: మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ ప్రకటించిన ఐడియా


త‌మ వినియోగ‌దారుల ముందు ఐడియా మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. ‘డేటా జాక్‌పాట్’ ఆఫర్ పేరిట త‌మ పోస్టుపెయిడ్ వినియోగదారులకు ‘మై ఐడియా యాప్’ ద్వారా నెలకు రూ.100కే 10 జీబీ డేటా అందించనున్న‌ట్లు తెలిపింది. ఈ ఆఫ‌ర్‌ను యాక్టివేట్ చేసుకున్న అనంత‌రం మొదటి మూడు నెలల పాటు ఈ 10జీబీ డేటా అందించనున్నట్లు పేర్కొంది. అనంత‌రం కూడా అదే ధరతో నెలకు 1 జీబీ డేటాను అందించనున్నట్టు తెలిపింది. ఇటీవ‌లే ఐడియా రూ.149-రూ.349ల రేట్ల‌తో ప‌లు ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

  • Loading...

More Telugu News