: 16 నెలలు నన్ను అన్యాయంగా జైల్లో పెట్టారు: జగన్
తనపై పెట్టిన కేసులు రాజకీయపరమైనవని వైసీపీ అధినేత జగన్ అన్నారు. తనపై కేసులు పెట్టింది కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబులే అని చెప్పారు. రాజకీయంగా తనను తొక్కేసేందుకు యత్నించారని ఆరోపించారు. తనను అన్యాయంగా, అకారణంగా 16 నెలల పాటు జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన నేడు శరద్ పవార్, ములాయం సింగ్ యాదవ్, సురవరం సుధాకర్ రెడ్డిలను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులపై కఠిన చట్టాలు తీసుకొచ్చేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.