: పుట్టినరోజున బాధను వ్యక్తం చేసిన రామ్ గోపాల్ వర్మ!
ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నేడు 55వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. సాధారణంగా ఎవరైనా పుట్టినరోజునాడు సంతోషాన్ని పంచుకుంటారు. కానీ, వర్మ మాత్రం బాధను పంచుకున్నాడు. ఈ రోజుతో తన వయసు మరో సంవత్సరం పెరిగిందన్న బాధలో ఉన్నానని తెలిపాడు. ఇది తనకు ఎంతో బాధాకరమైన రోజు అని... తన వయసు మరో సంవత్సరం పెరిగిందని ట్వీట్ చేశాడు. మరోవైపు ఓ వ్యక్తి పోస్ట్ చేసిన ఓ ఫొటోను వర్మ అప్ లోడ్ చేశాడు. తనను విమర్శించే వ్యక్తి దీన్ని పంపాడని తెలిపాడు.
A hater of mine did this and I love him for it