: సీబీఐ బెయిల్ రద్దు పిటిష‌న్‌: కౌంట‌ర్ దాఖ‌లు చేసిన జ‌గ‌న్ తరఫు న్యాయవాదులు


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహ‌న్ రెడ్డికి బెయిల్ ర‌ద్దు చేయాల‌ని కోరుతూ ఇటీవ‌లే సీబీఐ అధికారులు కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసిన విష‌యం తెలిసిందే. కేసును ప్రభావితం చేసేలా జగన్ ప్రవర్తిస్తున్నారని అందులో పేర్కొన్నారు. సదరు పిటిష‌న్‌ సీబీఐ కోర్టులో ఈ రోజు విచార‌ణ‌కు వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ తర‌ఫు న్యాయ‌వాదులు ఈ రోజు కోర్టులో కౌంట‌ర్ దాఖ‌లు చేశారు. జ‌గ‌న్ అక్ర‌మాస్తుల‌ కేసులో సాక్షిగా ఉన్న మాజీ సీఎస్ ర‌మాకాంతరెడ్డి ఇటీవ‌ల ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలోని ప‌లు అంశాలను న్యాయ‌వాదులు కోర్టుకు వివ‌రించారు. ఆ ఇంట‌ర్వ్యూలో విలేక‌రి అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మాత్ర‌మే ర‌మాకాంత్ స‌మాధానాలు చెప్పారని, ఆయ‌న వ్యాఖ్య‌ల‌తో జ‌గ‌న్‌కు ఎటువంటి సంబంధం లేద‌ని అన్నారు.  

  • Loading...

More Telugu News