: తెలంగాణ ఏర్పడిన తరువాత తొలిసారి వరంగల్ కు వచ్చిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ ఉదయం వరంగల్ కు వచ్చారు. తెలంగాణ తెలుగుదేశం నేత సీతక్క కుమారుడి వివాహం నేడు జరుగుతుండగా, ఈ కార్యక్రమానికి ఆయన అతిథిగా హాజరయ్యారు. స్థానిక తెలుగుదేశం నేతలు ఆయనకు స్వాగతం పలికారు. వధూవరులను ఆశీర్వదించిన చంద్రబాబు, అక్కడి నేతలతో కాసేపు మాట్లాడారు. అంతకుముందు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలోని హెలిపాడ్ లో దిగిన ఆయన, కారులో హంటర్ రోడ్డులో విష్ణుప్రియ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన వివాహ మండపానికి వచ్చారు. కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటిసారిగా చంద్రబాబునాయుడు వరంగల్ కు రావడం గమనార్హం.