: ఆ ఇంట్లో 42 నాగుపాములు దొరికాయ్!


మ‌నం వెళుతున్న దారిలో పాము క‌నిపిస్తే వ‌ణికిపోతాం.. అది అక్క‌డి నుంచి దూరంగా వెళ్లిపోయే వ‌ర‌కు ఆగి ఆ త‌రువాత మెల్లిగా ముందుకు క‌దులుతాం. అదే పాము మ‌న ఇంట్లో క‌నిపిస్తే ఇక మ‌నం పాములు ప‌ట్టేవారిని పిలిపించి, దాన్ని త‌రిమేసే వ‌ర‌కు ఆ ఇంట్లో కాలుపెట్ట‌బోం. అయితే, ఇంట్లో ఏకంగా 42 పాములు ఉంటే? అదే జ‌రిగింది పెద్దపల్లి జిల్లా యైటింక్లైన్ కాలనీలో ఓసీపీ -3లో హెడ్ ఓవర్‌మెన్‌గా పనిచేస్తున్న మల్లేశం ఇంటి ఆవరణలో. త‌మ ఇంట్లో ప్ర‌తిరోజు ఓ పాము క‌నిపిస్తుండ‌డంతో మ‌ల్లేశం భ‌య‌భ్రాంతుల‌కు గురై  పాములు పట్టే  వారిని పిలిపించాడు. పాములు ప‌ట్టేవారు అక్క‌డ‌కు చేరుకొని పాముల‌ను వెత‌క‌డం ప్రారంభించ‌గానే, ఒక దాని తరువాత ఒకటిగా మొత్తం 42 పాములు బ‌య‌ట‌ప‌డ్డాయి. అన్నింటినీ ప‌ట్టుకొని వకీల్‌పల్లి సమీపంలోని చెట్లపొదల్లో పాములు ప‌ట్టేవారు వదిలేశారు. మల్లేశం ఇంటి ఆవరణలో నాగుపాము సేదతీరి ఇన్ని పిల్లలకు జన్మనిచ్చినట్లు పాములు ప‌ట్టేవారు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News