: అమెరికా సాయం తీసుకుందాం.. ప్లీజ్: ఫరూక్ అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్యలు
కాశ్మీర్ విషయంలో భారత్, పాకిస్థాన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను పరిష్కరించే క్రమంలో... మధ్యవర్తిత్వం వహించేందుకు తాము సిద్ధమంటూ అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే. అవసరమైతే తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంలో స్వయంగా పాలుపంచుకుంటారని ఐక్యరాజ్యసమితిలో అమెరికా ప్రతినిధి నిక్కీ హేలీ తెలిపారు. ఈ నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ, అమెరికా ఆఫర్ ను అంగీకరించాలని భారత్, పాక్ లకు విన్నవించాడు. కశ్మీర్ సమస్యను పరిష్కరించుకోవడానికి ఉన్న అవకాశాలన్నింటినీ ఉపయోగించుకోవాలని వ్యాఖ్యానించాడు. అయితే, అమెరికా ప్రతిపాదనను వెంటనే భారత్ కొట్టి వేసిన సంగతి గమనార్హం. కశ్మీర్ విషయంలో మూడో వ్యక్తి జోక్యానికి తాము అంగీకరించమని భారత్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి.