: శశికళకు మద్దతు పలికిన హీరో శరత్ కుమార్ ఇంటిపైనా ఐటీ దాడులు


తమిళనాడులో అనూహ్యంగా శశికళ వర్గానికి మద్దతు పలికిన నటుడు శరత్ కుమార్ ఇళ్లపైనా ఐటీ దాడులు మొదలయ్యాయి. ఈ ఉదయం నుంచి ఆరోగ్య మంత్రి సీ విజయభాస్కర్ ఇళ్లు, కార్యాలయాలపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక శరత్ కుమార్ విషయానికి వస్తే, ఆయన ఆర్కే నగర్ ఓటర్లకు డబ్బులు పంపకానికి సహకరించారని పక్కా సమాచారంతో ఐటీ అధికారులు దాడులు చేసినట్టు తెలుస్తోంది. మొత్తం 34 ప్రాంతాల్లో మూడు వందల మందికి పైగా అధికారులు ఈ సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. వీకే శశికళ వర్గం నుంచి అన్నాడీఎంకే అమ్మ పార్టీ తరఫున నిలబడ్డ వ్యక్తికి ఓటేయాలంటూ డబ్బులు పంచుతున్న వీడియో వైరల్ అవుతుండగా, దీని ఆధారంగా ఐటీ అధికారులు కూపీ లాగి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వారిచ్చిన గ్రీన్ సిగ్నల్ తో శరత్ కుమార్, విజయభాస్కర్ ఇళ్లపై దాడులు ప్రారంభించారు. 45 సెకన్లున్న ఈ వీడియోలో ఓటుకు రూ. 4 వేలు ఇచ్చి కొంటున్నట్టు స్పష్టంగా ఉండటం గమనార్హం.

  • Loading...

More Telugu News