: లాలూ ప్రసాద్ యాదవ్ కు షాక్ ఇచ్చిన నితీష్ ప్రభుత్వం
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు బీహార్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. లాలూ కుటుంబానికి ప్రమేయం ఉన్న మట్టి కుంభకోణంపై బీహార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విచారణకు ఆదేశించారు. వాస్తవానికి బీహార్ లో నితీష్ కుమార్ కు చెందిన జేడీయూ పార్టీ, లాలూకు చెందిన ఆర్జేడీల సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోంది. అయితే, గత కొంత కాలంగా లాలూ పట్ల నితీష్ వ్యతిరేక వైఖరిని కనబరుస్తున్నారనే వార్తలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఈ వాదనకు మరింత బలాన్ని కలిగించాయి. ఈ విచారణ కారణంగా నితీష్, లాలూల మధ్య దూరం పెరిగే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.