: 30 లక్షల కుటుంబాలకు లబ్ధిని చేకూర్చే దస్త్రంపై లోకేష్ తొలి సంతకం!


కొద్దిసేపటి క్రితం ఏపీ పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్, మూడు దస్త్రాలపై సంతకాలు చేశారు. దాదాపు 30 లక్షల కుటుంబాలకు లబ్ధిని కలిగించే దస్త్రంపై తొలి సంతకం చేశారు. ఈ ఏడాది కనీసం 50 రోజులు పని చేసిన కుటుంబాలను భవన నిర్మాణ కార్మికులుగా గుర్తిస్తూ తయారు చేసిన ఫైల్ పై ఆయన సంతకం పడింది. తద్వారా వచ్చే ప్రయోజనాలు ఆయా కుటుంబాలకు అందనున్నాయి.

పెళ్లి చేసుకుంటే రూ. 10 వేల నగదుతో పాటు ప్రసూతి ఖర్చుల నిమిత్తం మరో రూ. 20 వేలు, ప్రమాద బీమా కింద రూ. 5 లక్షల వంటి 11 ప్రయోజనాలు కనిపించే దస్త్రంపై సంతకం చేశారు. ఆపై పంచాయితీ రాజ్ ద్వారా అన్ని గ్రామాల్లో ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి తయారైన ఫైల్ పై రెండో సంతకం, అన్ని గ్రామాల్లో ఎల్ఈడీ దీపాల ఏర్పాటు ద్వారా దేశంలోనే ఏపీని మొదటి స్థానంలో నిలపాలన్న లక్ష్యంతో తయారు చేసిన ఫైల్ పై మూడో సంతకం పెట్టారు. లోకేష్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనకు అభినందనలు తెలిపేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పోటీ పడటం గమనార్హం.

  • Loading...

More Telugu News