: వేదికపై నృత్యం చేస్తున్న మహిళా యాంకర్ ను కొట్టిన దువ్వాడ సీఐ
బొర్రమాంబ పుట్ట బంగారు మహోత్సవాలు వైభవంగా జరుగుతున్న వేళ, ఊరి నడిబొడ్డున 'డ్యాన్స్ బేబీ డ్యాన్స్' కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, అందులో పాల్గొనేందుకు వచ్చిన ఓ మహిళా యాంకర్ ను దువ్వాడ సీఐ సాయి వేదికపై నుంచే కొడుతూ, లాక్కెళ్లిన ఘటన కలకలం రేపింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఓ మహిళా యాంకర్ ను ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా నిర్వాహకులు తీసుకొచ్చారు. కార్యక్రమం ప్రారంభమైన తరువాత, స్టేజ్ పై ఆమె డ్యాన్స్ చేసింది.
అయితే, అశ్లీల నృత్యం చేస్తున్నావని ఆరోపిస్తూ, సీఐ చేయి చేసుకుని, ఆమెను స్టేషన్ కు తీసుకెళ్లారు. అక్కడ కూడా కొట్టడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆపై వైద్యం నిమిత్తం స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటరుకు తరలించారు. ప్రస్తుతం ఆమె వద్దకు వెళ్లేందుకు పోలీసులు ఎవరినీ అనుమతించడం లేదు. ఆమె ఎలాంటి అసభ్య నృత్యాలు చేయలేదని, డ్యాన్స్ ఆపాలని చెబితే సరిపోయేదానికి కొట్టే హక్కు ఎవరిచ్చారని స్థానికులు మండిపడుతున్నారు.