: వేద మంత్రోచ్చారణ మధ్య మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన చినబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. పురోహితుల వేద మంత్రోచ్చారణ మధ్య ఆయన బాధ్యతలను స్వీకరించారు. అమరావతిలోని నూతన సచివాలయంలోని ఐదో బ్లాకు మొదటి అంతస్తులోని తన ఛాంబర్ లో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల శ్రీవేంకటేశ్వరుడి పటాన్ని చేతపట్టి ఆయన తన ఛాంబర్ లోకి ప్రవేశించారు. పూజా కార్యక్రమాల అనంతరం, లోకేష్ ను పురోహితులు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. అనంతరం ఐటీ, పంచాయతి రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఛాంబర్ లోని తన సీటులో కూర్చొని అధికారికంగా మంత్రి అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ కు మండలి ఛైర్మన్ చక్రపాణితో పాటు పలువురు మంత్రులు, టీటీడీ ఓఎస్డీ డాలర్ శేషాద్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.

More Telugu News