: సిరియాపై బాంబుల వర్షం కురిపిస్తున్న అమెరికా.. ఈ తెల్లవారుజాము నుంచి కొనసాగుతున్న దాడులు


సిరియాలో కొనసాగుతున్న రక్తపాతాన్ని అంతమొందించే లక్ష్యంతో అమెరికా క్షిపణి దాడులు ప్రారంభించింది. భారత కాలమానం ప్రకారం ఈ తెల్లవారుజామున ఆరు గంటల నుంచి ప్రారంభమైన దాడులు కొనసాగుతున్నాయి. సిరియాలోని షైరత్ వైమానిక స్థావరంపై అత్యంత శక్తిమంతమైన తొమహక్ క్షిపణులను ప్రయోగించింది. తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న ఇడ్లిబ్‌ ప్రావిన్స్‌లో మూడు రోజుల క్రితం సిరియా సైన్యం రసాయన ఆయుధాలతో దాడులు చేసింది. ఈ దాడిలో అమాయక చిన్నారులు సహా వందమందికిపైగా పౌరులు మృతి చెందగా మరో 400 మంది తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రుల్లో చేరారు.

సిరియా రసాయన దాడికి వ్యతిరేకంగానే క్షిపణి దాడికి దిగినట్టు అమెరికా పేర్కొంది. సిరియాలో కొనసాగుతున్న మానవహననం, రక్తపాతానికి ముగింపు పలికేందుకు ఇతర దేశాలు కూడా ముందుకొచ్చి అమెరికాతో కలిసి పనిచేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. జాతి భద్రతా ప్రయోజనాల దృష్ట్యా ఈ దాడికి దిగినట్టు ట్రంప్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News