: చంద్రబాబు మారకపోతే కొట్టుకుపోతారు.. ఇక బాబుకు సీఎం కుర్చీపై ఆశ ఉండదు: జేసీ
టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాలం మారుతోందని, పద్ధతులు కూడా మారుతున్నాయని తాను మాత్రం మారనంటూ చంద్రబాబు వ్యతిరేకంగా పోతే కొట్టుకుపోతారని అన్నారు. పార్టీ ఫిరాయింపులపై ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ వెళ్లిన జగన్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఏమీ వైసీపీ ఎమ్మెల్యేలను పిలవలేదన్నారు. జగన్ మూర్ఖత్వాన్ని భరించలేకే వారు పార్టీని వీడుతున్నారని అన్నారు. జగన్ రాత్రుళ్లు దందాలు, పగలు భేటీలు జరుపుతారని ఆరోపించారు. ఇప్పటితో చంద్రబాబు 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసినట్టు అవుతుందని, దీంతో ఇక ఆయనకు సీఎం కావాలన్న ఆశ ఉండదని జేసీ అన్నారు. అయితే ప్రజలు తమ అవసరాల కోసమైనా చంద్రబాబును గెలిపించాలని జేసీ పిలుపునిచ్చారు.