: ఖరీదైన కారులో అసెంబ్లీకి వెళ్లిన మహారాష్ట్ర ఎమ్మెల్యే!
ఓ ఖరీదైన కారులో మహారాష్ట్ర అసెంబ్లీకి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు బీజేపీ ఎమ్మెల్యే మీరా భయందర్. సుమారు రూ.5.5 కోట్ల విలువ చేసే ల్యామ్ బోర్గీ లగ్జరీ కారులో ఆయన అసెంబ్లీకి చేరుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. కాగా, తన భార్య సుమన్ కు గత ఏడాది పుట్టిన రోజు కానుకగా ఈ కారును మీరా భయందర్ ఇచ్చారు. అయితే, ఆ కారును అప్పట్లో ఆమె నడుపుతూ ఓ ఆటో రిక్షాను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో రిక్షా దెబ్బతింది. అయితే, ఆటోవాలాకు ఆయన నష్టపరిహారం ఇవ్వడంతో సమస్య సద్దుమణగింది.