: అదృష్టమంటే వీళ్లదే... మూడోసారి జాక్ పాట్ కొట్టారు!


ఎవరినైనా అదృష్టం ఒకసారి పలకరిస్తుంది...పొరపాటున రెండో సారి కూడా అదృష్టం వరిస్తే...వాహ్ అంటాము...అదే మూడోసారి కూడా వారినే అదృష్టం వరిస్తే...అదృష్టమంటే వీళ్లదేరా అనాల్సిందే....కెనడాలో ఓ జంటను చూసినవారు ఇప్పుడు అదే అంటున్నారు. వివరాల్లోకి వెళ్తే... కెనడాకి చెందిన బార్బరా, డగ్లస్‌ ఫింక్‌ దంపతులు 1989లో 1.28 లక్షల డాలర్ల లాటరీని నలుగురు స్నేహితుల భాగస్వామ్యంలో తొలిసారి గెలుచుకున్నారు. అనంతరం 2010లో రెండోసారి లక్ష డాలర్ల లాటరీని గెలుచుకుని అదృష్టవంతులనిపించుకున్నారు. తాజాగా 8.1 మిలియన్‌ డాలర్ల (39 కోట్ల రూపాయల) విలువైన వెస్ట్రన్‌ కెనడా లాటరీ కార్పొరేషన్‌ (డబ్లూసీఎల్‌సీ) నిర్వహించిన ఫిబ్రవరి లాటరీని గెలుచుకుని అదృష్టమంటే వీరిదే అనిపించుకున్నారు. తాము ఎంత సంపాదించినా పిల్లలు, మనవళ్ల కోసమే అంటున్నారు. 

  • Loading...

More Telugu News