: రేపు ఉదయం మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న లోకేష్
ఇటీవల జరిగిన ఏపీ మంత్రి వర్గ విస్తరణలో పదవి దక్కించుకున్న యువ నేత నారా లోకేష్ రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా రేపు ఉదయం 9.45 గంటలకు ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించేందుకు ముహూర్తం నిర్ణయించారు. ఐదో బ్లాకు మొదటి అంతస్తులో ప్రత్యేక ఛాంబర్ ను లోకేశ్ కు సిద్ధం చేశారు. కాగా, రాష్ట్ర అటవీ శాఖ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖా మంత్రి శిద్దా రాఘవరావు కూడా రేపు ఉదయం 10 గంటలకు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఐదో బ్లాకు మొదటి అంతస్తులోని రూమ్ నెం.211 లో శిద్దాకు ఛాంబర్ కేటాయించారు.