: బెన్ స్టోక్స్ కు రెండు సిక్సర్లతో స్వాగతం పలికిన బట్లర్


ఐపీఎల్ సీజన్ 10లో అత్యంత ఖరీదైన ఆటగాడు బెన్ స్టోక్స్ కు జోస్ బట్లర్ షాకింగ్ ఆరంభాన్నిచ్చాడు. టాస్ గెలిచిన పూణే సూపర్ జెయింట్స్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా...ముంబై ఇండియన్స్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. కీపర్ పార్థివ్ పటేల్, జోస్ బట్లర్ జోడీ దూకుడుగా ఆడే ప్రయత్నం చేసింది. తొలి రెండు ఓవర్లు పార్థివ్ దూకుడుగా ఆడితే... మూడో ఓవర్ బెన్ స్టోక్స్ వేయగా, జోస్ బట్లర్ దూకుడు ప్రదర్శించాడు. వరుసగా రెండు సిక్సర్లు బాది స్టేడియంలో ఉత్సాహం నింపాడు. అనంతరం బంతినందుకున్న సౌతాఫ్రికా అగ్ర స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ తొలి బంతికే పార్థివ్ పటేల్ (19)ను పెవిలియన్ కు పంపి పూణే శిబిరంలో ఉత్సాహం నింపాడు. అనంతరం బట్లర్ (26) కు కెప్టెన్ రోహిత్ శర్మ జత కలిశాడు. దీంతో 5 ఓవర్లలో ముంబై ఇండియన్స్ జట్టు ఒక వికెట్ కోల్పోయి 48 పరుగులు చేసింది. 

  • Loading...

More Telugu News