: 'బాహుబలి- ద కన్ క్లూజన్' టికెట్ కావాలంటే 'బాహుబలి- ది బిగినింగ్' కూడా చూడాలట!
'బాహుబలి' తొలి భాగానికి జాతీయ, అంతర్జాతీయంగా వచ్చిన పాప్యులారిటీతో 'బాహుబలి 2' చిత్రానికి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఈ డిమాండ్ ను పరిగణనలోకి తీసుకున్న 'బాహుబలి-2' హిందీ డిస్ట్రిబ్యూటర్ కరణ్ జొహార్ సరికొత్త నిర్ణయం తీసుకుని... సరికొత్త ఆఫర్ తో అభిమానుల ముందుకు వచ్చాడు.
అదేమిటంటే, 'బాహుబలి- ది కన్ క్లూజన్' సినిమా టికెట్లు కావాలంటే 'బాహుబలి: ద బిగినింగ్' సినిమా చూడాలని షరతుపెట్టాడు. త్వరలో రెండోసారి విడుదల కానున్న 'బాహుబలి: ద బిగినింగ్' సినిమా చూసినవారికి రెండో భాగం టికెట్లు తొందరగా దొరికేలా చేస్తామని ఆఫర్ ఇచ్చారు. దీంతో ఒక్క సినిమా టికెట్ కోసం రెండు సినిమా టికెట్లు కొనుగోలు చేసి చూడాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ ఓన్లీ ఉత్తరభారత దేశ ప్రేక్షకులకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కరణ్ జొహార్ తెలిపాడు.