: తెలంగాణలో రేపు ఆటో, వ్యాను, ట్రాలీల బంద్
పెరిగిన బీమా, రవాణా ఫీజులను తగ్గించాలని, అలాగే తమకు నష్టాలు రావడానికి కారణమవుతున్న ఓలా, ఊబర్ సంస్థలను నిషేధించాలని డిమాండ్ చేస్తూ రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో, వ్యాన్లు, ట్రాలీల బంద్‌ను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్‌ను ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఆటోడ్రైవర్స్ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్లో విడుదల చేసింది. రేపు బంద్‌తో పాటు పెద్ద నిరసన కార్యక్రమాలను కూడా చేపట్టనున్నట్లు తెలిపింది. రేపు హైదరాబాద్‌లోని ఏఐటీయూసీ భవన్ నుంచి రాజ్‌భవన్ వరకు భారీ ఆటో ప్రదర్శనను నిర్వహిస్తామని పేర్కొంది.