: టీడీపీని వదిలి నేను ఎక్కడికీ వెళ్లడం లేదు: రేవంత్ రెడ్డి
తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి, బీజేపీలో చేరుతున్నారనే వదంతులు వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి స్పందిస్తూ, ‘నేను టీడీపీని వదిలి ఎక్కడికి వెళ్లడం లేదు. నేను బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదు. టీడీపీ - బీజేపీ మిత్ర పక్షాలు. బీజేపీ బలపడితే టీడీపీకి కూడా మంచిదే. తెలంగాణలో టీడీపీతో పొత్తు ఉండదని చెప్పాల్సింది రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కాదు. ఈ విషయమై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఏపీ సీఎం చంద్రబాబు తేల్చుకోవాలి’ అని ఒక న్యూస్ ఛానెల్ తో రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.