: ముఖ్యమంత్రి తల్చుకుంటే దారినపోయే దానయ్యను కూడా మంత్రిని చేయవచ్చు: జేసీ దివాకర్ రెడ్డి
ముఖ్యమంత్రి తల్చుకుంటే దారినపోయే దానయ్యను తెచ్చి ఆరు నెలలపాటు మంత్రిని చేయవచ్చని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, దివంగత రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంలో కొనసాగారని ఆయన గుర్తుచేశారు. సీబీఐ కేసులు తరుముకొస్తున్నప్పుడు మాత్రమే జగన్ ఢిల్లీ వస్తాడని ఆయన ఎద్దేవా చేశారు. జగన్ మూర్ఖత్వంతోనే బంధువులు, అనుచరులు పార్టీ వీడుతున్నారని తెలిపారు. జగన్ కి యాత్ర ముఖ్యమని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో రాష్ట్రపతి పాత్ర చాలా తక్కువని అన్నారు. జగన్ అనవసరంగా ఆయనను కలిసి పరేషాన్ చేస్తున్నాడని ఆయన మండిపడ్డారు.