: కాకినాడ బీచ్ లో ఐదుగురు విద్యార్థుల మృతి... మరో ముగ్గురి పరిస్థితి విషమం
కాకినాడలోని ఎన్టీఆర్ బీచ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బీచ్‌కి వెళ్లి సరదాగా గడపాలనుకున్న ఎనిమిది మంది విద్యార్థులు నీళ్లలో కొట్టుకుపోయారు. వెంటనే స్పందించిన సహాయక బృందాలు రంగంలోకి దిగి, వారిని బయటకు తీయగా, వారిలో ఐదుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ఇద్దరు యువతులు ఉన్నట్లు సమాచారం. మృతుల కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించడంతో వారు బీచ్ వద్దకు చేరుకున్నారు.