: రణ్ వీర్ సింగ్ తో ఫోటో దిగిన సచిన్ కుమార్తె... సోషల్ మీడియాలో వైరల్
టీమిండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సచిన్ కుమార్తె సారా బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ కు వీరాభిమాని. అయితే ఆమెకు అతనిని కలుసుకునే అవకాశం ఇంతవరకు రాలేదు. ఈ మధ్యే అతనిని కలిసే అవకాశం వచ్చింది. దీంతో అతనితో సెల్ఫీ దిగి తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చేస్తూ ఫ్యాన్ మూవ్ మెంట్ అని పేర్కొంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకవైపు సచిన్ అభిమానులు, మరోవైపు రణ్ వీర్ సింగ్ అభిమానులు షేర్ చేసుకుంటున్నారు. కాగా, సారా టెండూల్కర్ గతంలో సినిమాల్లో నటించనుందంటూ వార్తలు వెలువడగా, సచిన్ వాటిని ఖండించి, 'ఆమె చదువుకుంటోంది...సినిమాల్లోకి వచ్చే ఆలోచన లేదు' అని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.