: పార్టీ వ్యవహారాలను మర్చిపోతే ఎలా?: నాయకుల పనితీరుపై నారా లోకేశ్ అసంతృప్తి
నామినేటెడ్ పదవులు పొందిన తర్వాత కొందరు నాయకులు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని, పార్టీతో తమకు సంబంధం లేదన్నట్టుగా ఉంటున్నారని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. అమరావతిలో ఈ రోజు నిర్వహించిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో లోకేశ్ మాట్లాడుతూ, నామినేటెడ్ పోస్టులు పొందిన నాయకులు, పార్టీ వ్యవహారాలను మరిచిపోయారని, అలా వ్యవహరించడం సరికాదని, ప్రతిఒక్కరి పని తీరును పరిశీలిస్తున్నానని చెప్పారు.