: మణిరత్నం సర్ చెప్పిన తరువాత ఆశ్చర్యపోయా!: కార్తీ
చెలియా సినిమా షూటింగ్ కు ముందు మణిరత్నం సర్ పిలిచి... కార్తీ నువ్వు పూర్తిగా మారాలని అన్నారని, అందుకు సరే అని తలవూపానని హీరో కార్తీ గుర్తుచేసుకున్నాడు. అయితే ఎలా మారాలని అడిగితే ఆఫీసర్ లా మారాలని చెప్పారని అన్నాడు. అందుకోసం తాను కోల్ కతా వెళ్లి నాలుగు వారాలు శిక్షణ తీసుకున్నానని చెప్పాడు. ఈ సినిమా కోసం చాలా మారానని చెప్పాడు.
"ఆ తరువాత షాకింగ్ వార్త చెప్పారు. మీసం తీసేయమని అన్నారు. దీంతో కాసేపు తటపటాయించినా సరే అన్నాను. తరువాత తొలి రోజు షూటింగ్ కోసం స్క్రిప్టు ఇచ్చారు. దానిని చదివి స్పాట్ కు వెళ్లి నేను ఊహించుకున్నట్టు నటిద్దామని భావించాను. అయితే, షాకింగ్... మణి సార్ ఆ షాట్ ను వేరేగా డిజైన్ చేశారు" అన్నాడు కార్తీ. ఆయన పూర్తిగా తన ఆలోచనలను మార్చేశారని, దీంతో తాను ఆశ్చర్యపోయానని కార్తీ చెప్పాడు. తరువాత మరింత జాగ్రత్తగా ఒళ్లు దగ్గరపెట్టుకుని నటించానని అన్నాడు.