: మరో ఉచిత ఆఫర్ ప్రకటించిన జియో
ఇప్పటికే పలు ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకున్న రిలయన్స్ జియో మరో ఉచిత ఆఫర్ ను ప్రకటించింది. ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండానే కాలర్ ట్యూన్స్ ను పొందే అవకాశాన్ని కస్టమర్లకు కల్పించింది. జియో ట్యూన్ సర్వీస్ ద్వారా కాలర్ ట్యూన్స్ ను సెట్ చేసుకోవచ్చని జియో తెలిపింది. జియో మ్యూజిక్ యాప్ లో ఈ ఆప్షన్ ఉంటుందని వెల్లడించింది. వాస్తవానికైతే ఈ కాలర్ ట్యూన్స్ కు నెలవారీ ఛార్జీలను టెలికాం సంస్థలు వసూలు చేస్తాయి. కానీ, జియో ఈ కాలర్ ట్యూన్స్ ను నెల రోజుల పాటు ఉచితంగా అందిస్తోంది.