: సీఎం చంద్రబాబు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతా: పరిటాల సునీత
ఏపీ మహిళా,శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పరిటాల సునీత ఈ రోజు పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా అమరావతిలో విలేకరులతో ఆమె మాట్లాడుతూ, చాలా ప్రాధాన్యం కలిగిన శాఖను తనకు సీఎం చంద్రబాబు అప్పగించారని, తనపై ఆయన ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని అన్నారు. మహిళా,శిశు సంక్షేమానికి పాటుపడతానని, తన వంతు కృషి చేస్తానని సునీత చెప్పారు. కాగా, గతంలో పౌరసరఫరాల శాఖా మంత్రిగా సునీత పనిచేశారు. ఇటీవల జరిగి మంత్రి వర్గ విస్తరణలో ఆమె శాఖను మార్చడం జరిగింది.