: ఎడ్ల పందేల్లో అపశ్రుతి.. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కు గాయాలు!


టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి గాయాలయ్యాయి. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా సూర్యాపేట జిల్లాలోని చింతలపాలెం మండలం నక్కగూడెంలో ఎడ్ల పందేలను నిర్వహించారు. ఈ పందేలను ప్రారంభించేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లారు. అయితే, కొన్ని ఎడ్లు బెదిరి పరుగులు తీయడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో ఉత్తమ్ వైపు ఓ ఎద్దు దూసుకురావడంతో ఆయన కాలికి గాయాలయ్యాయి. ఎడ్ల పందేలను తిలకించేందుకు వచ్చిన పలువురు గ్రామస్తులూ గాయపడ్డారు.

  • Loading...

More Telugu News