: లోక్ సభలో శివసేన ఎంపీల ప్రవర్తన దురదృష్టకరం: చంద్రబాబు


లోక్ సభలో కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజుపై శివసేన ఎంపీలు దురుసుగా ప్రవర్తించడంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. శివసేన ఎంపీలు ప్రవర్తించిన తీరును ఖండించారు. శివసేన ఎంపీలు ఆ విధంగా ప్రవర్తించడం దురదృష్టకరమని, ఇటువంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి తీరని మచ్చగా మిగిలిపోతాయని, పార్లమెంటు సంప్రదాయాలను గౌరవించేలా సభ్యులు హుందాగా ప్రవర్తించాలని ఆయన కోరారు. ఇటువంటి సంఘటనలు మరోమారు జరగకుండా ఆయా పార్టీల నాయకత్వాలు కఠినంగా వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు.

  • Loading...

More Telugu News