: అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగిన పాకిస్థాన్ క్రికెటర్ మిస్బావుల్ హక్
పాక్ టెస్టు కెప్టెన్సీ నుంచి మిస్బావుల్ హక్(42)ను తప్పుకోమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కోరగా ఆయన దానికి ఒప్పుకోలేదన్న విషయం తెలిసిందే. తాను కెప్టెన్సీ నుంచి ఎందుకు తప్పుకోవాలంటూ ఆ సమయంలో ప్రశ్నించిన ఆయన.. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి పూర్తిగా తప్పుకుంటున్నానని అన్నాడు. వెస్టిండీస్‌తో జరిగే సిరీసే తనకు చివరిదని ప్రకటించాడు. దేశవాళీ క్రికెట్‌లోనే ఇక ఆడతానని తేల్చిచెప్పాడు. క్రికెట్‌తో తన అనుబంధాన్ని మాత్రం కొనసాగిస్తానని చెప్పాడు. మిస్బావుల్ హక్ తన కెరీర్‌లో 72 టెస్టులు, 162 వన్డేలు, 39 టీ-20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ విషయంపై పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ రిటైర్మెంట్‌పై తాము హక్‌తో ఇంకా మాట్లాడలేదని, అయితే, ఇంతలోనే హక్ రిటైర్మెంట్ ప్రకటించాడని ఆయన వ్యాఖ్యానించారు.