: జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానాన్ని ఢీ కొన్న పక్షి.. తప్పిన ప్రమాదం


జెట్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన ఓ విమానం ఈ రోజు ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకుంది. కోల్‌క‌తాలోని ఎన్ఎస్సీ బోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టులో విమానం దిగుతుండగా దానికి ఓ పక్షి తగిలింది. ఈ ఘ‌ట‌న‌తో మొద‌ట కంగారుపడిన పైలెట్ తర్వాత తేరుకొని విమానాన్ని సుర‌క్షితంగా ల్యాండ్ చేశారు. ఆ విమానం బెంగళూరు నుంచి వచ్చిందని విమానాశ్ర‌య అధికారులు తెలిపారు. ప‌క్షి ఢీ కొన‌డంతో విమానం కుడివైపు ఉన్న ఇంజిన్‌ దెబ్బతిందని తెలిపారు. ప్రస్తుతం ఇంజిన్‌కు మరమ్మతులు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ విమానం కోసం టికెట్లు తీసుకున్న ప్ర‌యాణికుల‌ను వేరే విమానం ద్వారా పంపిస్తామ‌ని అన్నారు. 

  • Loading...

More Telugu News