: ఏపీ తరపున ఎవరెస్ట్ పర్వతారోహణ కోసం ఆరుగురు సభ్యుల బృందం ఎంపిక
ఆంధ్రప్రదేశ్ తరపున ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించేందుకు ఆరుగురు సభ్యుల బృందాన్ని ఎంపిక చేశామని రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మొత్తం 300 మంది ఔత్సాహికులకు వివిధ పరీక్షలు నిర్వహించి, వీరిలో మంచి ప్రతిభ కనబరిచిన ఆరుగురిని ఎంపిక చేశామని ఆయన చెప్పారు. ఈ నెల 12వ తేదీన మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ నుంచి వీరి ప్రయాణం మొదలవుతుందని తెలిపారు. మే 15 నుంచి 25వ తేదీల మధ్య వీరు ఎవరెస్ట్ పైకి చేరుకుంటారని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఎవరెస్ట్ పై జాతీయ పతాకాన్ని ఈ బృందం ఎగురవేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం కోసం రూ. 2.40 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు వెల్లడించారు.