: నన్ను బ్లాక్ లిస్టులో పెట్టడమేంటి? నా దగ్గర ఏమైనా మారణాయుధాలు ఉన్నాయా? : లోక్‌సభలో గైక్వాడ్
ఎయిరిండియా సిబ్బందిని తాను కొట్టిన అంశంపై ఎంపీ గైక్వాడ్ ఈ రోజు లోక్‌సభలో వివరణ ఇచ్చారు. ఎయిరిండియా సిబ్బంది తనను నువ్వు ఏమైనా మోదీవా? అని ప్రశ్నించారని చెప్పారు. నువ్వు ఎంపీవి మాత్రమే, ప్రధానివి కాదు అని మాట్లాడారని తెలిపారు. ఎయిరిండియా సిబ్బంది తనపై దురుసుగా ప్రవర్తించడంతోనే తాను ప్రతిస్పందించానని చెప్పారు. తనపై కేసులు ఎలా పెడతారని అన్నారు. తన దగ్గర ఏమైనా మారణాయుధాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. తన పేరును బ్లాక్ లిస్టులో పెట్టడమేంటని నిలదీశారు. ఎయిరిండియా సిబ్బంది తనను అవమానించారని చెప్పారు. తన మీద పెట్టిన కేసులన్నీ ఎత్తివేయాలని గైక్వాడ్ అన్నారు. ఈ వివాదంలో మీడియా కూడా అసత్య ప్రచారం చేసిందని ఆరోపించారు.