: రసాయన దాడిలో తన కవలపిల్లలు సహా 22 మంది కుటుంబీకుల్ని కోల్పోయాడు!
సిరియాలో విషపూరిత వాయువుతో చేసిన దాడులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ని సైతం కలచివేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో వంద మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోగా, మరో 400 మంది ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే, ఈ దాడిలో తన కుటుంబసభ్యులందరినీ కోల్పోయి సిరియాలోని ఇడ్లిబ్ రాష్ట్రానికి చెందిన అబ్దెల్ హమీద్ అనే వ్యక్తి ఇప్పుడు తనకు ఎవరూ లేని ఒంటరి అయ్యాడు. ఈ దాడిలో తన 9 నెలల వయస్సున్న తన ఇద్దరు కవల పిల్లలు సహా తన కుటుంబంలోని మొత్తం 22 మందిని కోల్పోయాడు. తన కన్నీళ్లను దిగమింగుతూ తన కుటుంబ సభ్యులందరినీ ఖననం చేశాడు.