: అసంతృప్తులకు ఏం చేద్దాం?: సహచరుల అభిప్రాయాలు కోరిన చంద్రబాబు
రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ తరువాత, నేతల్లో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నడుం బిగించారు. ఈ ఉదయం ఆయన అధ్యక్షతన అమరావతిలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరుగగా, ఎవరెవరికి అసంతృప్తి కలిగింది? నిజంగా అన్యాయం జరిగింది ఎవరికి? అని ప్రశ్నించి వివరాలు రాబట్టిన ఆయన, ఖాళీగా ఉన్న పలు కార్పొరేషన్ పదవుల్లో ఎవరికి ఏది ఇవ్వచ్చన్న విషయాన్ని అడిగి తెలుసుకున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, పలువురు సీనియర్ నేతలు హాజరు కాగా, జగన్ ఢిల్లీ పర్యటన, త్వరలో రానున్న సంస్థాగత ఎన్నికల్లో పాటించాల్సిన వ్యూహం తదితర అంశాలూ చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.