: ఆయనకు పని మాత్రమే ముఖ్యం.. మీడియా సమావేశం మధ్యలో లేచివెళ్లి అరెస్టు చేశాడు!
ఓ పోలీసు అధికారి మీడియా సమావేశంలో మాట్లాడుతున్నాడు.. ఇంతలో ఓ తాగుబోతు అక్కడి పరిసర ప్రాంతంలో అసభ్యంగా మాట్లాడుతూ.. విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నాడు. అది గమనించిన ఆ పోలీస్ అధికారి మీడియా సమావేశం మధ్యలోంచి లేచివెళ్లి మరీ అతడిని పోలీస్ స్టేషన్‌లోకి ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. విన్‌స్టన్ ఉడ్‌వర్డ్ అనే పోలీస్ అధికారి పోలీస్ స్టేషన్ బయట మీడియాతో మాట్లాతుండగా జరిగిందిది. ఆస్ట్రేలియాకి చెందిన ఓ మీడియా సంస్థ ఈ వీడియోని యూట్యూబ్‌లో పోస్ట్ చేయడంతో ఈ వీడియోను ఎంతో మంది షేర్ చేశారు. దీంతో ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆ తాగుబోతుని అరెస్టు చేసిన ఆ పోలీస్ అధికారి తిరిగి మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు.