: పాక్ జాతీయ గీతం పాడిన కాశ్మీర్ క్రికెటర్ల అరెస్ట్... దేశద్రోహం కేసు నమోదు


జమ్మూ కాశ్మీర్ లోని గందేర్బల్ ప్రాంతంలో ఓ క్రికెట్ మ్యాచ్ ప్రారంభానికి ముందు పాకిస్థాన్ జట్టు ధరించే జర్సీలు ధరించి, ఆ దేశ జాతీయ గీతాన్ని ఆలపించిన జట్టు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై దేశద్రోహం సహా పలు సెక్షన్ల కింద కేసులు పెట్టినట్టు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. వీరి చర్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. కేంద్ర కాశ్మీర్ పరిధిలో ఉన్న ఓ మైదానంలో ఈ నెల 2న ఈ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ప్రధాని చెనానీ - నాస్రి టన్నెల్ ను ప్రారంభించేందుకు కాశ్మీర్ కు వెళ్లిన వేళ, వేర్పాటువాదులు బంద్ కు పిలుపునిచ్చిన సమయంలోనే కాశ్మీరీ క్రికెటర్లు పాక్ జాతీయ గీతాన్ని ఆలపించారు.

  • Loading...

More Telugu News