: వెంకన్నపై సమ్మె ప్రభావం... తిరుమలలో నిండుకున్న అత్యవసర సరుకులు!


గత వారం రోజులుగా జరుగుతున్న లారీల సమ్మె ప్రభావం తిరుమలను కూడా తాకింది. నిత్యమూ లక్షలాది మందికి అన్న ప్రసాదాలను సమకూరుస్తున్న టీటీడీకి నిత్యమూ అవసరమయ్యే అత్యవసర సరుకులు సరఫరా కావడం లేదు. నిల్వ ఉంచుకున్న సరుకులు నిండుకోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. తిరుపతిలోని సరుకులు, కూరగాయల గోడౌన్లకు సరఫరా లేకపోవడంతో, అక్కడి నుంచి తిరుమలకు సైతం సరుకుల తరలింపు నిలిచిపోయింది. సమ్మె మరో రెండు రోజులు కొనసాగితే, లడ్డూ, తదితర ప్రసాదాల తయారీపైనా ప్రభావం పడుతుందన్న ఆందోళన మొదలైంది. కాగా, తమ వద్ద మరో వారానికి పైగా సరిపడే నిల్వలు ఉన్నాయని చెబుతున్నా, అది బియ్యం, పప్పులకు మాత్రమేనని, కూరగాయలకు కొరత ఉన్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News