: బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన రద్దు?


బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఢిల్లీలో ఓ కీలకమైన సమావేశం ఉన్న నేపథ్యంలో, హైదరాబాద్ పర్యటనను ఆయన రద్దు చేసుకున్నట్టు సమాచారం. దీంతో, బీజేపీ ఆఫీస్ బేరర్లు అత్యవసరంగా భేటీ అయ్యారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అమిత్ షా వస్తున్నారంటూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాదులో బీజేపీ రాష్ట్ర కమిటీ ప్రత్యేక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసింది.

తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా వ్యూహరచన చేస్తున్న బీజేపీ అధిష్ఠానం... హైదరాబాదు పార్లమెంటు నియోజకవర్గం సీటుపై కన్నేసిన సంగతి తెలిసిందే. దశాబ్దాలుగా ఎంఐఎం అధీనంలో ఉంటూ ఆ పార్టీకి కంచుకోటగా నిలుస్తూ వస్తున్న ఈ స్థానంలో క్రమంగా ఉనికిని పెంచుకుంటూ వస్తున్న బీజేపీ... తన విజయావకాశాలను మెరుగు పరుచుకునేందుకు అమిత్ షా పర్యటన ఉపకరిస్తుందని భావించింది. ప్రస్తుతానికి అమిత్ షా పర్యటన రద్దైనా... త్వరలోనే ఆయన పర్యటన ఉంటుందని బీజేపీ శ్రేణులు తెలిపాయి. 

  • Loading...

More Telugu News