: కన్యలకు స్వయంగా పాదపూజ చేసిన యోగి ఆదిత్యనాథ్


నవరాత్రి సందర్భంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా కన్యపూజ చేశారు. లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో బాలికలకు సంప్రదాయ పూజలు చేశారు. వారి కాళ్లు కడిగి, తిలకం దిద్దారు. ఆ తరువాత హల్వా, పూరీలను స్వయంగా వడ్డించి, వారితో 'అన్నదాతా సుఖీభవ' అనిపించుకున్నారు. పార్వతీదేవి తొమ్మిది అవతారాలకు చిహ్నంగా తొమ్మిది మంది చిన్నారులకు ఆయన కన్య పూజలు చేశారు. ఉత్తరాదిలో కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి తొమ్మిది రోజుల పాటు పూజలు జరుగుతాయన్న సంగతి తెలిసిందే. ఈ తొమ్మిది రోజులూ యోగి నియమ నిబంధనలతో కూడిన ఉపవాస దీక్షను చేశారు. దీక్ష పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కన్యపూజలు జరిగాయి.

  • Loading...

More Telugu News