: తిరుమల ఖాళీ... వెలవెలబోతున్న క్యూ కాంప్లెక్స్!
నిత్యమూ భక్తులతో కిటకిటలాడే తిరుమల గిరులు వెలవెలబోతున్నాయి. ఈ ఉదయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కేవలం రెండు కంపార్టుమెంట్లలో మాత్రమే భక్తులు దర్శనం కోసం వేచి చూస్తుండగా, మిగతా కంపార్టుమెంట్లు వెలవెలబోతున్నాయి. వీరికి ఉదయం 11 గంటల్లోగా దర్శనం పూర్తవుతుందని, నడకదారి భక్తులకు, ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు గంటలోపే దర్శనం లభిస్తోందని అధికారులు తెలిపారు. మండుతున్న ఎండలు ఓ వైపు, విద్యాలయాలకు ఇంకా సెలవులు మొదలు కాకపోవడంతోనే భక్తుల రాక తగ్గిందని తెలుస్తోంది. ఇక కొండపై భక్తులు మందగించడంతో, స్థానికులు దర్శనానికి తరలి వెళుతున్న పరిస్థితి నెలకొంది.