: యాంకరింగ్ కత్తిమీద సాములాంటింది.. తొలి తెలుగు టీవీ యాంకర్ శాంతిస్వరూప్


టీవీ యాంకరింగ్ అనేది కత్తిమీద సాములాంటిందని తొలి తెలుగు టీవీ యాంకర్, వ్యాఖ్యాత శాంతిస్వరూప్ అన్నారు. డాక్టర్ ఎ.రవీంద్రబాబు రాసిన ‘యాంకర్ కావడం ఎలా?’ పుస్తకావిష్కరణ కార్యక్రమం బుధవారం హైదరాబాదు, సోమాజీగూడలోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ జర్నలిజం విభాగం హెచ్‌వోడీ ప్రొఫెసర్ స్టీవెన్‌సన్‌, ప్రొఫెసర్‌ మృణాళిని, ప్రముఖ యాంకర్‌ సుమతో కలిసి శాంతిస్వరూప్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు టెలివిజన్ విజ్ఞానాన్ని, సమాచారాన్ని అందించేదని, ఇప్పుడు కేవలం వినోదానికే పరిమితమైందని అన్నారు. యాంకర్‌గా రాణించాలనుకునే వారికి రవీంద్రబాబు రాసిన ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అనంతరం ప్రొఫెసర్‌ స్టీవెన్‌సన్‌, మృణాళిని, సుమ మాట్లాడారు. వ్యక్తిగతంగా ఎన్ని బాధలు ఉన్నా వాటిని తెరమీద కనిపించకుండా జాగ్రత్త పడాలని సూచించారు.

  • Loading...

More Telugu News