: విభజనతో కర్నూలు నాశనమైంది.. తలచుకుంటే కడుపు మండుతోంది: కర్నూలు కలెక్టర్ ఆవేదన
ఆంధ్రప్రదేశ్ విభజనతో కర్నూలు జిల్లా సర్వనాశనమైందని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. అది తలచుకుంటేనే కడుపు మండుతోందని అన్నారు. బుధవారం నగరంలో నిర్వహించిన బాబు జగ్జీవన్‌రామ్ జయంతి సభకు ముఖ్య అతిథిగా హాజరైన విజయ మోహన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఆంధ్ర, రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం పేదలకు చాలా చేస్తోందని అన్న వైసీపీ నాయకుడు సి. మద్దయ్య వ్యాఖ్యలపై స్పందించిన కలెక్టర్ పైవిధంగా వ్యాఖ్యానించారు.